Indian Army: చొరబాట్ల నిరోధానికి.. నియంత్రణ రేఖ వెంబడి ‘స్మార్ట్‌ కంచె’..!

ఎల్‌వోసీ వెంబడి భారత్‌లోకి చొరబాట్లను సైన్యం కట్టడి చేస్తోంది. వాటిని మరింత పటిష్ఠంగా అడ్డుకునేందుకు అత్యాధునిక సెన్సార్, సీసీటీవీ కెమెరా టెక్నాలజీల ఆధారిత ‘స్మార్ట్ కంచె (Smart Fences)’లను మోహరించింది.

Published : 13 Aug 2023 22:14 IST

శ్రీనగర్: నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోకి చొరబాట్ల (Infiltration)ను సైన్యం ఎప్పటికప్పుడు కట్టడి చేస్తోంది. సరిహద్దుల వద్ద అనుక్షణం గస్తీ కాస్తోంది. ఈ క్రమంలోనే ఎల్‌వోసీ వెంబడి చొరబాటు ప్రయత్నాలను మరింత పటిష్ఠంగా అడ్డుకునేందుకు అధునాతన సాంకేతికతను రంగంలోకి దించింది. అత్యాధునిక సెన్సార్, సీసీటీవీ కెమెరా టెక్నాలజీల ఆధారిత ‘స్మార్ట్ కంచె (Smart Fences)’లను ఏర్పాటు చేసింది. జమ్మూలోని ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కర్నల్ సునీల్ బర్త్వాల్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘స్మార్ట్‌ కంచె’లు సరిహద్దు భద్రత, నిఘాను మరింత పటిష్ఠం చేశాయని చెప్పారు.

ఎల్‌వోసీ వద్ద భద్రత కార్యకలాపాలకు వినియోగిస్తున్న సాంకేతికతలు, పరికరాలను లెఫ్టినెంట్ కర్నల్ సునీల్ బర్త్వాల్ ప్రదర్శించారు. ‘నియంత్రణ రేఖ వెంబడి సైన్యం వినియోగిస్తోన్న అధునాతన సాంకేతికతల్లో ‘స్మార్ట్ కంచె’లు ఒక భాగం. అత్యాధునిక సెన్సార్‌లు, సీసీటీవీ కెమెరాల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఇవి చిన్నపాటి కదలికను కూడా గుర్తించి.. వెంటనే కంట్రోల్‌ సెంటర్‌కు హెచ్చరికలు పంపుతాయి’ అని లెఫ్టినెంట్ కర్నల్ సునీల్ బర్త్వాల్ చెప్పారు. ‘సైనిక కార్యకలాపాల్లో సాంప్రదాయిక పద్ధతులతోపాటు అధునాతన ఆవిష్కరణల వినియోగం.. భారతీయ సైనికుడి బహుముఖ పాత్రను ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని