Assam Bridge: ‘సో బ్యూటిఫుల్‌.. సో ఎలిగెంట్‌’..! ఆన్‌లైన్‌ ట్రెండ్‌లో చేరిన అస్సాం సీఎం

అస్సాంలోని ఓ వంతెన ఫొటోలను ‘ఎక్స్‌’లో పోస్టు చేసిన సీఎం హిమంత బిశ్వశర్మ.. ‘సో బ్యూటిఫుల్‌.. సో ఎలిగెంట్‌.. జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఏ వావ్‌’ అంటూ రాసుకొచ్చారు.

Published : 13 Nov 2023 02:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సో బ్యూటిఫుల్‌.. సో ఎలిగెంట్‌.. జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఏ వావ్‌’ అంటూ వస్త్ర దుకాణంలో ఓ మహిళ చేసిన సందడి ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ పదబంధంతో కూడిన రీల్స్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) కూడా ఈ ట్రెండ్‌లో చేరిపోయారు. అస్సాంలో హిమాలయాలతో కూడిన ఓ వంతెన (Kolia Bhomora Setu) ఫొటోలను ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేసిన హిమంత.. ‘జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఏ వావ్‌’ అంటూ రాసుకొచ్చారు.

తేదీతో సంబంధం లేదు.. ఆ 6 గ్రామాల్లో బుధవారమే దీపావళి

‘‘తేజ్‌పుర్‌లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ‘కోలియా భోమోర వంతెన’ ఇది. శీతాకాలపు ఉదయం వేళలో వంతెన వద్ద నుంచి హిమాలయాలూ కనిపిస్తున్నాయి. ఎంత మహత్తర దృశ్యం ఇది! తక్కువ వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ), కాలుష్య రహిత వాతావరణం కారణంగా.. అరుణాచల్- టిబెట్ సరిహద్దు సమీపంలోని ఈ పర్వత శ్రేణులు స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. ‘సో బ్యూటిఫుల్‌.. సో ఎలిగెంట్‌.. జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఏ వావ్‌’’ అంటూ హిమంత ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోలు కాస్త ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. అద్భుతమైన దృశ్యమంటూ నెటిజన్లూ స్పందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని