కశ్మీర్‌లో పోలీసులపై ఉగ్రదాడి

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సొపోర్‌ జిల్లాలోని అరమ్‌పొరా పోలీసు శిబిరం వద్ద సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై శనివారం దాడికి పాల్పడ్డారు.

Published : 12 Jun 2021 21:58 IST

ఇద్దరు పోలీసులు, ఇద్దరు స్థానికుల మృతి

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సొపోర్‌ జిల్లాలోని అరమ్‌పొరా పోలీసు శిబిరం వద్ద సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై శనివారం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు స్థానికులు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు పోలీసులకు, ఓ స్థానికుడికి గాయాలు కాగా.. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన స్థానికుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. మరణించిన స్థానికులను సొపోర్‌లోని క్రాల్‌ తెంగ్‌కు చెందిన మంజూర్‌ అహ్మద్‌, బషీర్‌ అహ్మద్‌గా  గుర్తించినట్టు వివరించారు. ఈ దాడి వెనక లష్కరే తోయిబా ఉగ్రముఠా ఉన్నట్టు కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని