పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గింపు.. ఎక్కడంటే..?

మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్ తగ్గిస్తూ కెబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

Updated : 14 Jul 2022 14:57 IST

ముంబయి: మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్ తగ్గిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ. 3 తగ్గించింది.  ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.111.35కి లభిస్తోంది. ఇప్పుడది రూ.106.35కి తగ్గనుంది. అదే సమయంలో రూ.97.28గా డీజిల్.. రూ. 94.28కే లభ్యం కానుంది. ఈ తగ్గింపుతో రాష్ట్రంపై రూ.6 వేల కోట్ల మేర భారం పడనుంది. అయితే ఈ చర్య వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి రానుందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వెల్లడించారు. 

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇటీవల దేశంలో ఇంధన ధరలు అమాంతం పెరిగిన విషయం తెలిసిందే. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కేంద్రం ఇటీవల రెండు సార్లు తగ్గించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రాలు కూడా వ్యాట్‌ తగ్గించాలని కోరింది. అయితే, వ్యాట్‌ తగ్గించేందుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఈ విషయమై ఆ మధ్య కేంద్రం, అప్పటి ఠాక్రే సర్కారు మధ్య మాటలయుద్ధం కూడా జరిగింది. ఈ క్రమంలో భాజపా మద్దతుతో శివసేన చీలిక వర్గ నేత శిందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే.. ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించనున్నట్టు ప్రకటించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని