ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్‌’

తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్‌ బూత్‌కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్‌ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్‌’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

Published : 01 May 2024 06:20 IST

 అస్సాం ఐఏఎస్‌ అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన

అమింగావ్‌: తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్‌ బూత్‌కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్‌ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్‌’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. సోమవారం నాగర్‌బెరా ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసిన యువత.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో మొదటి సారి ఓటు వేసే వారి చేతికి బడ్డీ బ్యాండ్‌ను కట్టి తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సుమారు 200 మంది తొలి సారి ఓటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘సాధారణంగా తమ రక్షణకు హామీ ఇవ్వాలని కోరుతూ సోదరులకు చెల్లెళ్లు రాఖీ కడతారు. అదే విధంగా మేము మొదటిసారి ఓటు వేసే వారికి తోడుగా ఉంటామని, ఓటు వేయాలని చెబుతూ సీనియర్లు కట్టేదే ఈ బడ్డీ బ్యాండ్‌’ అని కీర్తి వెల్లడించారు. ‘ఏడో తేదీన ఓటు వేయండి’ అని ఈ బ్యాండ్లపై రాసి ఉంది. మే 7న ఈ జిల్లాలో పోలింగ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు