కేజ్రీవాల్‌ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?

దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది.

Published : 01 May 2024 06:19 IST

ఈడీని ప్రశ్నించిన సుప్రీం
సమాధానం ఇవ్వాలని ఆదేశం

దిల్లీ: దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. దీనిపై వచ్చే విచారణ నాటికి సమాధానం చెప్పాలంటూ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజును జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం ఆదేశించింది. ‘జీవితం, స్వేచ్ఛ అనేవి అత్యంత ముఖ్యమైనవి. వాటిని నిరాకరించలేం’ అని పేర్కొంది. దిల్లీ మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టులో సవాలు చేశారు. దీనిపై స్పందనను తెలపాలంటూ ఏప్రిల్‌ 15న సర్వోన్నత న్యాయస్థానం ఈడీని కోరింది. ఈ కేసుపై తదుపరి విచారణ శుక్రవారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీ కింద కేజ్రీవాల్‌ తిహాడ్‌ జైల్లో ఉన్నారు. అంతకుముందు కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడాన్ని హైకోర్టు సమర్థించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని