Deepfake videos: లోక్‌సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్‌ఫేక్‌’ వ్యవహారం

Deepfake videos: లోక్‌సభ ఎన్నికల సమయంలో డీప్‌ఫేక్‌ వీడియోల వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Published : 01 May 2024 13:15 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ డీప్‌ఫేక్‌ వీడియోలు (Deepfake videos) తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల కేంద్రమంత్రి అమిత్ షా సహా పలువురి నకిలీ వీడియోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా దిల్లీ హైకోర్టు (Delhi HC)లో పిటిషన్‌ దాఖలైంది.

లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) జరుగుతున్నందున ఈ డీప్‌ఫేక్‌ వీడియోల వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. సామాజిక మాధ్యమ వేదికలకు గ్రీవెన్స్‌ అధికారులు ఉన్నారని, పిటిషనర్లు వారిని సంప్రదించారా? అని ప్రశ్నించింది.

తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే

దీనికి పిటిషనర్‌ తరఫు న్యాయవాది బదులిస్తూ.. ‘‘మేం చేయగలినదంతా చేశాం. గ్రీవెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తే రెస్పాన్స్‌ సమయం 24 నుంచి 48 గంటల మధ్య ఉంది. వారు చర్యలు తీసుకుని, ఆ వీడియోలను తొలగించేలోగా జరగాల్సిన నష్టం జరుగుతుంది’’ అని కోర్టుకు తెలిపారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామన్న ధర్మాసనం.. పిటిషన్‌పై గురువారం విచారణ జరుపుతామని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని