నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?

అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Published : 01 May 2024 05:07 IST

నివేదించాలని అస్సాం రాష్ట్ర న్యాయసేవల సంస్థకు సుప్రీంకోర్టు ఆదేశం

 దిల్లీ: అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికోసం ఒక బృందాన్ని నియమించి ఆ శిబిరాలను తనిఖీ చేయించాలని, అక్కడ ఉన్న వసతుల వివరాలనూ తెలపాలని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నివేదికను మే 15వ తేదీలోగా సమర్పించాలని తెలిపింది. కొన్నేళ్లుగా నిర్బంధ శిబిరాల్లో మగ్గుతున్న విదేశీయుల విషయాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం మంగళవారం సూచించింది. బందీలుగా ఉన్న విదేశీయులను విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణ మే 16 తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని