జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి.

Published : 01 May 2024 05:10 IST

జమ్మూ: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. వీటి కారణంగా వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గల్లంతయ్యారు. రైసీ జిల్లాలో ఇద్దరు వాగులో పడి కొట్టుకుపోగా ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. గధీగడ్‌లో మరో వ్యక్తి కాలువ దాటుతుండగా నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. అతడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దోడా జిల్లాలోని ఓ నది నుంచి 13 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. మరో ఘటనలో విరిగిన కొండ చరియలు ఢీకొనడంతో ఓ బాలుడు మృతిచెందాడు. పూంఛ్‌ జిల్లాలోని కలర్‌ మోడా ఓడా గ్రామంలో నలుగురు పాఠశాల విద్యార్థులు, ఇద్దరు మహిళలు వాగులో చిక్కుకోగా స్థానికులు వారిని రక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని