దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్‌ ఆసియా     క్లైమేట్‌ అవుట్‌లుక్‌ ఫోరం (ఎస్‌ఏఎస్‌సీవోఎఫ్‌) మంగళవారం వెల్లడించింది.

Published : 01 May 2024 06:24 IST

సాధారణం కంటే ఎక్కువని ఎస్‌ఏఎస్‌సీవోఎఫ్‌ తాజా అంచనా

దిల్లీ: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్‌ ఆసియా క్లైమేట్‌ అవుట్‌లుక్‌ ఫోరం (ఎస్‌ఏఎస్‌సీవోఎఫ్‌) మంగళవారం వెల్లడించింది. ఆగస్టు-సెప్టెంబరు మధ్య అనుకూల లానినో పరిస్థితులతో భారత్‌లో సాధారణం కంటే అధికంగానే వానలు పడతాయని ఇప్పటికే భావిస్తుండగా తాజా అంచనాలు వాటిని మరింత బలపరుస్తున్నాయి. ‘‘2024 నైరుతి రుతుపవనాల కాలం(జూన్‌-సెప్టెంబరు)లో దక్షిణాసియాలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయి. అయితే కొన్ని ఉత్తర, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కంటే కొంచెం తక్కువ వానలు పడతాయి’’ అని ఎస్‌ఏఎస్‌సీవోఎఫ్‌ తెలిపింది. ఎస్‌ఏఎస్‌సీవోఎఫ్‌ తాజా అంచనాలను ఈ ప్రాంతంలోని తొమ్మిది వాతావరణ విభాగాలు సంయుక్తంగా రూపొందించాయి. ఇందుకు అంతర్జాతీయ నిపుణుల సహాయాన్ని తీసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని