పశ్చిమబెంగాల్‌లో 47.6 డిగ్రీలు

దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని కలాయ్‌కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

Published : 01 May 2024 05:07 IST

దేశంలో రికార్డు ఉష్ణోగ్రతలు

దిల్లీ: దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని కలాయ్‌కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఫలితంగా భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) ఆ ప్రాంతంలో ఆరెంజ్‌ అలర్ట్‌ని జారీ చేసింది. మరోవైపు శీతల ప్రాంతాలైన ఊటీ, మథేరాన్‌ సైతం మండుతున్న వేసవి నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. 29.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుతో గత ఇరవై ఏళ్ల రికార్డును తమిళనాడులోని ఊటీ బద్దలు కొట్టింది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని పలు నగరాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల కంటే అధికంగా నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని