lucknow: పోలీసు వాహనంతో రీల్స్‌... కట్‌ చేస్తే...

సామాజిక మాధ్యమాల్లో లైకులు, కామెంట్ల కోసం కొంతమంది యువత అడ్డదారులు తొక్కుతున్నారు. వీడియోలు, రీల్స్‌ పేరుతో ఇష్టారీతిగా ప్రవర్తిస్తూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు.

Published : 19 Feb 2024 02:03 IST

లఖ్‌నవూ: సామాజిక మాధ్యమాల్లో లైకులు, కామెంట్ల కోసం కొంతమంది యువత అడ్డదారులు తొక్కుతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన లేకుండా వీడియోలు, రీల్స్‌ చేయడానికి రోడ్లు, మెట్రోలు, ఆసుపత్రులు అన్నింటినీ వాడేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ యువకుడు ఇన్‌స్టా రీల్‌ చేయడానికి ఏకంగా పోలీసు జీప్‌నే వాడటంతో ఇబ్బందుల్లో పడ్డాడు. 

ఉత్తర్‌ప్రదేశ్‌ గాజియాబాద్‌లోని ఇందిరాపురంలో పోలీసులు తమ వాహనాన్ని నిలిపి ఉంచి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. అక్కడే ఉన్న మొయిన్‌ ఖురేషీ అనే యువకుడు దీనిని అవకాశంగా తీసుకొని రీల్‌ చేయడానికి పోలీసు జీపును ఉపయోగించుకున్నాడు. సూట్ ధరించి పోలీసు వాహనం నుంచి దిగుతూ, ఎనర్జీ డ్రింక్‌ తాగుతూ రీల్‌ చేశాడు. దానికి బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌ జత చేసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో అది వైరలైంది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో వారు ఆ యువకుడిని అరెస్టు చేశారు. ఇన్‌స్టా నుంచి వైరల్‌ వీడియో తొలగించామని పోలీసు అధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని