MK Stalin: నాన్నే నన్ను పోలీసులకు అప్పగించారు: స్టాలిన్‌

ఎమర్జెన్సీ సమయంలో తనను తండ్రి కరుణానిధే పోలీసులకు అప్పగించారని, అందుకు తానేమీ బాధ పడలేదని తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్వీయ చరిత్రలో వెల్లడించారు. స్టాలిన్‌ స్వీయ చరిత్ర

Updated : 21 Mar 2022 07:11 IST

స్వీయ చరిత్రలో తమిళనాడు సీఎం

చెన్నై, న్యూస్‌టుడే: ఎమర్జెన్సీ సమయంలో తనను తండ్రి కరుణానిధే పోలీసులకు అప్పగించారని, అందుకు తానేమీ బాధ పడలేదని తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్వీయ చరిత్రలో వెల్లడించారు. స్టాలిన్‌ స్వీయ చరిత్ర పుస్తకం ‘ఉంగళిల్‌ ఒరువన్‌’ (మీలో ఒకడు) పేరిట తొలి భాగాన్ని ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అందులో ఈ విషయం ఉంది. ‘ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. అప్పట్లో పోలీసులు గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి వెళ్లి నన్ను అరెస్టు చేయడానికి వచ్చామని, తమవద్ద సెర్చ్‌ వారెంట్‌ ఉందని తెలిపారు. స్టాలిన్‌ మధురాంతకంలో ఉన్నానని, వచ్చిన వెంటనే తెలియజేస్తానని కరుణానిధి వారికి చెప్పి పంపారు. మరుసటి రోజు నేను తిరిగి వచ్చాక పోలీసులకు ఫోన్‌ చేసి నన్ను అరెస్టు చేసి తీసుకెళ్లాలని కరుణానిధి చెప్పారు. దీంతో నన్ను మిసా చట్టం కింద అరెస్టు చేశారు. ఆ సమయంలో చాలా మంది డీఎంకే నేతలు అరెస్టయ్యారు. వారిలో ఒకరిగానే నన్ను నా తండ్రి భావించారు’ అని స్వీయ చరిత్రలో స్టాలిన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని