Pakisthan PM: భారతదేశ జనాభాను తప్పుగా పలికిన పాక్‌ ప్రధాని 

భారతదేశ జనాభాను తప్పుగా పలికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి వార్తల్లో నిలిచారు

Published : 05 Aug 2021 01:45 IST

వైరల్‌ అవుతున్న ఇమ్రాన్‌ఖాన్‌ వీడియో

దిల్లీ : భారతదేశ జనాభాను తప్పుగా పలికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల దేశ ప్రజలను ఉద్దేశించి దృశ్య మాధ్యమ వేదికగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ‘ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో 40-50 లక్షల జనాభా కలిగిన న్యూజిలాండ్.. 1 బిలియన్ 300 కోట్ల జనాభా ఉన్న భారత్‌ను ఓడించింది’ అని చెప్పిన వీడియో వైరల్‌ అవుతుంది. (1 బిలియన్‌ అంటే 100 కోట్లతో సమానం)
భారతదేశ జనాభా 136 కోట్లు (1.3 బిలియన్లు)గా ఉంది. దీన్ని తప్పుగా చెప్పిన ఇమ్రాన్‌ను నెటిజన్లు ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. గతంలో ఉజ్బెకిస్థాన్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన బిజినెస్‌ ఫోరమ్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగిస్తూ.. ‘దేశ ప్రజల కంటే ఉజ్బెకిస్థాన్ చరిత్ర నాకే బాగా తెలుసు’ అన్నారు. మరోసారి 2019లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు ప్రారంభ వేడుకలో ఇతర దేశాల నాయకులు నిలబడి ఉంటే ఆయన కూర్చున్నాడు. ఈ రెండు సందర్భాల్లోనూ ఇమ్రాన్‌ ట్రోలింగ్‌కు గురయ్యాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని