రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు

రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

Published : 26 Apr 2024 05:16 IST

దిల్లీ: రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. మిగతావారినీ క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ గురువారం విలేకర్ల సమావేశంలో ఈ అంశంపై మాట్లాడారు. ఇంకా తమ సైన్యంలో సహాయక సిబ్బందిగా కొనసాగుతున్న భారతీయులను వెనక్కి పంపిస్తామని రష్యా హామీ ఇచ్చినట్లు చెప్పారు. వారి సంఖ్య దాదాపు 200 వరకు ఉంటుందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి గమనార్హం. మరోవైపు- ఇరాన్‌ సైన్యం స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌ సంబంధిత నౌకలోని 16 మంది భారతీయ సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నారని జైస్వాల్‌ తెలిపారు. వారితో భారతీయ దౌత్య అధికారులు మాట్లాడారని పేర్కొన్నారు. అయితే సాంకేతికపరమైన అంశాల కారణంగా.. వారిని స్వదేశానికి తీసుకురావడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని