వృద్ధుల్లో మరింత సమర్థంగా ఆ రెండు వ్యాక్సిన్లు

కరోనాను నివారించేందుకు అన్నిదేశాలు తమవంతు కృషి చేస్తున్నాయి. భారత్‌తో సహా అనేక దేశాలు

Published : 02 Mar 2021 22:45 IST

లండన్‌: కరోనాను నివారించేందుకు అన్నిదేశాలు తమవంతు కృషి చేస్తున్నాయి. భారత్‌తో సహా అనేక దేశాలు ప్రజలకు వ్యాక్సిన్‌ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాయి. 70 అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన వృద్ధుల్లో ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌లు మరింత సమర్థంగా పనిచేస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తెలిపింది. కరోనా వైరస్‌ వల్ల వచ్చే తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ కారకాలను ఇవి నిరోధించగలిగాయని తెలిపింది.

80 ఏళ్లు దాటి కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్సి పొందుతున్న వారు, మరణాల రేటును పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌(పీహెచ్‌ఈ)కి చెందిన పరిశోధకులు వేర్వేరుగా సమీక్షించారు. సింగిల్‌డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకుని 14 అంతకంటే ఎక్కువ రోజులైన తర్వాత కరోనా సోకిన వారికి కోలుకునే సామర్థ్యం 80శాతం పెరిగిందని తెలిపారు. వారంతా ఆస్పత్రి వెళ్లకుండానే కేవలం 3-4 వారాల్లో సాధారణ జీవనానికి వచ్చేశారని తెలిపారు. ఫైజర్‌ వ్యాక్సిన్‌ మరణాల రేటును 83శాతం వరకూ తగ్గించగలుగుతోందని తెలిపారు.

‘‘ఫైజర్‌, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ సింగిల్‌ డోస్‌ తీసుకున్న వృద్ధులు కొవిడ్‌ బారిన పడితే అది తీవ్ర వ్యాధులకు దారి తీయడాన్ని గణనీయంగా తగ్గిస్తోంది. ఇక్కడ ప్రజలందరూ మరోవిషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా తగిన జాగ్రత్తలతో బయటకు వెళ్లాలి. మాస్క్‌ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం ఇంకా కొన్నాళ్ల పాటు కొనసాగించాలి’ అని పీహెచ్‌ఈ హెడ్‌ రామ్‌సే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని