
రాష్ట్రపతితో ప్రధాని మోదీ కీలక భేటీ
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. వారణాసి పర్యటన ముగించుకొని దిల్లీ చేరుకున్న మోదీ.. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి కోవింద్‌తో భేటీ కావడం గమనార్హం. పలు కీలక అంశాలపై ఆయనతో ప్రధాని చర్చించినట్టు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఏయే అంశాలను రాష్ట్రపతితో చర్చించారనే విషయాలను మాత్రం పేర్కొనలేదు. మరోవైపు, ఈ నెల 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.
గురువారం ఉదయం కాశీలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ రూ.1500 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడిలో యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసలు కురిపించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.