Fishermen: 36 మంది భారత జాలర్లను విడుదల చేసిన బ్రిటన్‌

హిందూ మహాసముద్రంలో చేపల వేటకు వెళ్లి పట్టుబడిన భారత జాలర్లను బ్రిటన్‌ అధికారులు సోమవారం విడిచిపెట్టారు. సెప్టెంబర్‌ 29న తమిళనాడుకు చెందిన 36 మంది జాలర్లు చేపల వేట కోసం వెళ్లి బ్రిటీష్‌ ఓషియన్‌ టెర్రిటరీలోకి ప్రవేశించారు.

Updated : 20 Nov 2023 23:48 IST

తిరువనంతపురం: హిందూ మహాసముద్రంలో చేపల వేటకు వెళ్లి పట్టుబడిన భారత జాలర్లను బ్రిటన్‌ అధికారులు సోమవారం విడిచిపెట్టారు. సెప్టెంబర్‌ 29న తమిళనాడుకు చెందిన 36 మంది జాలర్లు చేపల వేట కోసం వెళ్లి బ్రిటీష్‌ ఇండియన్‌ ఓషియన్‌ టెర్రిటరీలోకి ప్రవేశించారు. దీంతో అక్కడ గస్తీకాస్తున్న బ్రిటన్‌ నేవీ వారిని అదుపులోకి తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తితో ఆ జాలర్లను బ్రిటన్ అధికారులు తాజాగా విడిచిపెట్టారు. వారిని కేరళలోని ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌కు అప్పగించారు. అయితే, తమ జలాల్లోకి ప్రవేశించినందుకు గానూ జాలర్లకు 25వేల పౌండ్లు జరిమానా విధించినట్లు బ్రిటన్‌ వెల్లడించింది. భారత్‌కు చేరుకున్న జాలర్లకు వైద్య పరీక్షలు నిర్వహించి, విచారణ జరిపి స్థానిక పోలీసులకు అప్పగించినట్లు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని