Nitin Gadkari: గడ్కరీ గరిటోపాఖ్యానం

ఏ విషయమైనా ముక్కుసూటిగా చెబుతారని పేరున్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కరోనా సమయంలో తాను రెండే విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఒకటి వంట చేయడం, రెండోది వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ఉపన్యాసాలు ఇవ్వడమని వివరించారు. యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేస్తున్న ఈ వీడియో సందేశాలకు ఆదరణ లభించడంతో ప్రతినెలా

Updated : 18 Sep 2021 08:14 IST

కరోనావేళ వంటలు, ఉపన్యాసాలతో కాలక్షేపం
ప్రతినెలా రూ.4 లక్షల యూట్యూబ్‌ రాయల్టీ

భరూచ్‌ (గుజరాత్‌): ఏ విషయమైనా ముక్కుసూటిగా చెబుతారని పేరున్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కరోనా సమయంలో తాను రెండే విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఒకటి వంట చేయడం, రెండోది వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ఉపన్యాసాలు ఇవ్వడమని వివరించారు. యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేస్తున్న ఈ వీడియో సందేశాలకు ఆదరణ లభించడంతో ప్రతినెలా తనకు రూ.4 లక్షలకు పైగా రాయల్టీ సమకూరుతున్నట్లు చెప్పారు. ‘కరోనా నన్ను షెఫ్‌గా మార్చింది. ఎన్నో వంటలు చేశా. వీసీల ద్వారా 950 ఉపన్యాసాలు ఇచ్చా. విదేశీ వర్సిటీల విద్యార్థులకూ క్లాసులు చెప్పా. వీటన్నిటినీ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశా. వ్యూస్‌ భారీగా వచ్చాయి’ అని గడ్కరీ వివరించారు. దిల్లీ - ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వే పనులను సమీక్షించిన సందర్భంగా రత్లాంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి ఈ విషయాలు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని