Aryan Khan: ఆందోళనలో ఉన్న ఆర్యన్‌.. జైల్లో ఏం చేస్తున్నాడంటే..?

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ గత మూడు వారాల నుంచి ముంబయి జైల్లోనే ఉంటున్నాడు. పలుమార్లు బెయిల్ కోసం అభ్యర్థన పెట్టుకున్నప్పటికీ.. నిరాశే ఎదురైంది. దాంతో ముంబయిలోని ఆర్థర్‌ రోడ్డు జైల్లో ఉంటున్న ఆర్యన్ ఆందోళనకు గురయ్యాడని తెలుస్తోంది. ఇది గమనించిన అధికారులు జైలు లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకొని చదవమని అతడికి సూచించారట.

Published : 25 Oct 2021 18:22 IST

ముంబయి: డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ గత మూడు వారాల నుంచి ముంబయి జైల్లోనే ఉంటున్నాడు. పలుమార్లు బెయిల్ కోసం అభ్యర్థన పెట్టుకున్నప్పటికీ.. నిరాశే ఎదురైంది. దాంతో ముంబయిలోని ఆర్థర్‌ రోడ్డు జైల్లో ఉంటున్న ఆర్యన్ ఆందోళనకు గురయ్యాడని తెలుస్తోంది. ఇది గమనించిన అధికారులు జైలు లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకొని చదవమని అతడికి సూచించారట. 

జైలు అధికారులు చెప్పినట్లే ఆర్యన్ పుస్తక పఠనంపై దృష్టిసారించాడు. మొదట లయన్స్ గేట్‌ చదివేశాడు. ఇప్పుడు దేవతామూర్తులు సీతారాములపై రాసిన పుస్తకాలను చదువుతున్నాడని వారు వెల్లడించారు. జైల్లో ఉన్న వ్యక్తి తన బంధువుల నుంచి పుస్తకాలు తెప్పించుకోవచ్చు. అయితే అవి మతపరమైనవే అయ్యుండాలనే నిబంధన ఉందని చెప్పారు. జైలు నుంచి విడుదలై వెళ్లేప్పుడు ఆ పుస్తకాన్ని ఇక్కడే వదిలేస్తే.. దాన్ని లైబ్రరీ పుస్తకాల జాబితాలో చేర్చుతారన్నారు. 

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌కు ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం పలు మార్లు బెయిల్ నిరాకరించింది. దాంతో అతడి తరఫు న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం( అక్టోబర్ 26) విచారణ జరగనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని