Joe Biden: మా సైనికుల ప్రాణాలు తీసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాం: బైడెన్‌

తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టబోమని..ప్రతీకారం తీర్చుకుంటామని జో బైడెన్‌ హెచ్చరించారు. 

Updated : 27 Aug 2021 17:17 IST

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో జరిగిన పేలుళ్లపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడుల్లో అమెరికా సైనికుల మృతిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టబోమని..ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు. దాడికి పాల్పడింది తామేనని ఇప్పటికే ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను హతమార్చాలని తమ దేశ ఆర్మీని బైడెన్‌ ఆదేశించారు. ఈనెల 31 కల్లా అఫ్గాన్‌ నుంచి తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. 

గురువారం కాబుల్‌ విమానాశ్రయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 72 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో అమెరికాకు చెందిన 11 మంది సైనికులు, ఓ నేవీ వైద్యుడు ఉన్నారు. ఆ దేశానికి చెందిన మరో 12 మంది సైనికులు గాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని