Myanmar: మయన్మార్‌లో మారణహోమం..మహిళలు, చిన్నపిల్లలపై సైన్యం దాష్టీకం

మయన్మార్‌ సైనిక ప్రభుత్వానికి చెందిన బలగాల అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. 

Updated : 26 Dec 2021 11:16 IST

30 మందికిపైగా కాల్చివేత

బ్యాంకాక్‌: మయన్మార్‌ సైనిక ప్రభుత్వానికి చెందిన బలగాల అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా శరణార్థుల శిబిరాలకు వెళుతున్న మహిళలు, చిన్నపిల్లలు సహా 30 మందిని సైన్యం కాల్చి చంపింది. అనంతరం మృతదేహాలకు నిప్పుపెట్టిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. కయాహ్‌ రాష్ట్రంలోని మోసో గ్రామం సమీపంలో ఈ ఘటన సంభవించినట్లు భావిస్తున్నారు. మోసో గ్రామం పక్కనే ఉన్న కియో గాన్‌ గ్రామం సమీపంలో శుక్రవారం సాయుధ ప్రతిఘటన బలగాలకు, మయన్మార్‌ సైన్యానికి మధ్య పోరాటం జరుగుతుండగా శరణార్థులు శిబిరాలకు పారిపోయారని ఓ గ్రామస్థుడు చెప్పారు. ఈ క్రమంలో వారిని ప్రభుత్వ బలగాలు అరెస్టు చేసి కాల్చి చంపాయని, అనంతరం మృతదేహాలకు నిప్పుపెట్టాయని తెలిపారు. గుర్తించేందుకు సైతం వీలు లేనంతగా మృతదేహాలు కాలిపోయాయని, ఆ ప్రాంతంలో మహిళలు, చిన్న పిల్లల దుస్తులు, ఆహారం, ఔషధాలు కనిపించాయని చెప్పారు. మృతదేహాలను తాళ్లతో కట్టేసి అనంతరం వాహనాల్లో పడేసి నిప్పుపెట్టారని వెల్లడించారు. తుపాకులతో కాల్చి చంపడాన్ని తాను ప్రత్యక్షంగా చూడలేదని, అయితే చనిపోయిన వారు శుక్రవారం మోసో గ్రామంలో అరెస్టైన వారేనని భావిస్తున్నట్లు ఆ సాక్షి తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని