370 రద్దుపై విచారణ.. సుప్రీంలో వాడీవేడీ వాదనలు

ఆర్టికల్‌ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు(Supreme Court)లో వాడీవేడీగా వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్రం వెల్లడించిన వివరాలను సీనియర్ న్యాయవాది కపిల్‌ సిబల్(Kapil Sibal) తప్పుపట్టారు. 

Published : 31 Aug 2023 17:49 IST

దిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కొద్దిరోజులుగా సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో గురువారం సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహతా( Solicitor General Tushar Mehta),సీనియర్ న్యాయవాది కపిల్‌ సిబల్(Kapil Sibal) మధ్య వాడీవేడీ వాదనలు జరిగాయి. (Article 370 Hearing)

గురువారం విచారణలో భాగంగా తుషార్‌ మెహతా మాట్లాడుతూ.. ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉందని చెప్పారు. అలాగే జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంపై మాత్రం ప్రభుత్వం కచ్చితమైన సమయాన్ని ఇవ్వలేకపోయిందని అన్నారు. అలాగే శాంతి భద్రతల అంశం గురించి మాట్లాడుతూ.. 2018లో 52 బంద్‌లు జరిగాయని, ప్రస్తుతం వాటి సంఖ్య జీరో అని తెలిపారు. అయితే ఈ మాటలను కపిల్ సిబల్(Kapil Sibal) తోసిపుచ్చారు. 

సుప్రీంకోర్టు పేరుతో నకిలీ వెబ్‌సైట్‌.. జాగ్రత్తగా ఉండాలని సీజేఐ హెచ్చరిక

‘5వేల మందిని గృహనిర్బంధం చేశారు. 144 సెక్షన్‌ విధించారు. అంతర్జాలంపై ఆంక్షలు ఉన్నాయి. ఇంక బంద్‌లు ఎలా జరుగుతాయి. ఈ కోర్టు వీటన్నింటిని గుర్తించింది. ప్రజలు కనీసం ఆసుపత్రులకు వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంద్‌లు ఎలా ఉంటాయి’ అని మెహతా వ్యాఖ్యలను సిబల్‌ తప్పుపట్టారు. .

వీరి వాదనలు తీవ్రరూపం దాలుస్తుండటంతో చీఫ్ జస్టిస్‌ డీవై చంద్రచూడ్ వారిని శాంతింపజేశారు. రాజ్యాంగపరమైన సమస్యలను రాజ్యాంగపరంగానే పరిష్కరించుకోవాలన్నారు. విధానపరమైన అంశాలను ప్రస్తావించొద్దన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ ప్రారంభమైన దగ్గరినుంచి వాదనలు న్యాయపరంగానే ఉన్నాయని, ఇప్పుడు అదే స్ఫూర్తి కొనసాగించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని