Vinod Dua: ప్రముఖ జర్నలిస్ట్‌ వినోద్‌ దువా కన్నుమూత

ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్‌ వినోద్‌ దువా (67) శనివారం కన్నుమూశారు. ఇటీవలే కరోనా సోకిన ఆయన దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటూ మరణించారు. భారత్‌లోని టీవీ జర్నలిజంలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వినోద్‌.. దూరదర్శన్, ఎన్టీడీవీ, ది వైర్‌ వంటి జాతీయ మీడియా ఛానెల్స్‌తో కలిసి పనిచేశారు.

Updated : 04 Dec 2021 19:25 IST

దిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్‌ వినోద్‌ దువా (67) శనివారం కన్నుమూశారు. ఇటీవలే కరోనా సోకిన ఆయన దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స  పొందుతూ కన్నుమూశారు. భారత్‌లోని టీవీ జర్నలిజంలో  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వినోద్‌.. దూరదర్శన్, ఎన్టీడీవీ, ది వైర్‌ వంటి జాతీయ మీడియా ఛానెల్స్‌తో కలిసి పనిచేశారు.  కాగా దువా మరణవార్తను ఆయన కుమార్తె మల్లికా దువా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ‘‘ మనం ఎంతగానో ఆరాధించే వ్యక్తి, ఎవరికి భయపడని నా తండ్రి వినోద్ దువా మరణించారు. ఎప్పుడూ సత్యాలనే మాట్లాడుతూ అసమానమైన జీవితాన్ని గడిపారు. ’’ అని పోస్ట్‌ చేశారు. కాగా జర్నలిజంలో ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2008లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని