Google Chrome: ఈ కొత్త ఫీచర్‌తో క్రోమ్‌ మరింత ఫాస్ట్‌గా.. యాక్టివేట్‌ చేసుకోండిలా..!

గూగుల్‌ క్రోమ్‌ కొత్తగా మెమొరీ సేవర్ ఆప్షన్‌ తీసుకొచ్చింది. దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం..

Published : 01 Apr 2023 01:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే వెబ్‌బ్రౌజర్లలో గూగుల్ క్రోమ్‌ (Google Chrome) ముందుంటుంది. డెస్క్‌టాప్‌ వెబ్‌బ్రౌజింగ్‌ అనగానే అందరికీ క్రోమే గుర్తుకొస్తుంది. వినియోగదారుని అవసరాలకు తగ్గట్టు అందులోని లోటుపాట్లను సరిచేస్తూ ఎప్పటికప్పుడు బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేయడమే అందుకు కారణం. తాజాగా గూగుల్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే మెమొరీ సేవర్‌ (Memory Saver). అసలేంటీ ఆప్షన్‌? ఎలా ఉపయోగపడుతుంది? ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలో చూద్దాం..

క్రోమ్‌ బ్రౌజర్‌లో ఒక్కోసారి మనం ఎక్కువ ట్యాబ్‌లు ఓపెన్‌ చేయాల్సి వస్తుంది. అయితే, కొంత సమయం తర్వాత అవసరం లేకపోయినా.. వాటిలో కొన్నింటిని అలాగే ఉంచేస్తాం. లేదా తర్వాత అవసరమవుతుందనుకున్నా అలాగే ఓపెన్‌ చేసి వదిలేస్తాం. ట్యాబ్‌ల సంఖ్య పెరిగిన కొద్దీ సిస్టం వేగం తగ్గుతుంది. అలా అని ట్యాబ్‌లను ఒక్కోసారి క్లోజ్‌ చేయడం కుదరదు. అలాంటప్పుడే ఈ మెమొరి సేవర్‌ ఆప్షన్‌ ఉపయోగపడుతుంది. ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ట్యాబ్‌లలోని మెమొరీ మొత్తాన్ని ఇది తొలగిస్తుంది. అలా ఇప్పుడు ఉపయోగిస్తున్న ట్యాబ్‌ల వేగం పెరుగుతుంది. ఒకసారి తిరిగి ఇన్‌యాక్టివ్‌ ట్యాబ్‌ను ఓపెన్‌ చేయగానే అది తిరిగి రీలోడ్‌ అవుతుంది.

ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి..

  • ల్యాప్‌ట్యాప్‌/డెస్క్‌టాప్‌లో ఉన్న గూగుల్‌ క్రోమ్‌ని ఓపెన్ చేయాలి.
  • గూగుల్‌ అకౌంట్స్‌లోకి లాగిన్‌ కావాలి.
  • మీ ప్రొఫైల్‌ ఫొటో పక్కనున్న మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి.
  • అందులో ‘Settings’ ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఎంచుకోవాలి.
  • ‘Settings’లో ‘ Performance section’పై క్లిక్‌ చేయగానే మీకు మెమొరీ సేవర్ మోడ్‌ ఆప్షన్ కనబడుతుంది. 
  • దానిపై క్లిక్‌ చేసి కింద ఉన్న ‘Add’ ఆప్షన్‌ ఎంచుకోగానే మోడ్‌ యాక్టివేట్‌ అవుతుంది.

అయితే, ఈ మోడ్‌ను యాక్టివేట్‌ చేసుకోవడం వల్ల బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతున్న మ్యూజిక్‌, యూట్యూబ్‌, పాడ్‌కాస్ట్‌ వంటి మీడియా మాత్రం ఆగిపోదు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని