Updated : 10 Mar 2022 04:52 IST

Pig Heart Transplant: మనిషికి పంది గుండె మార్పిడి.. ప్రయోగం విఫలం

వాషింగ్టన్‌: వైద్యశాస్త్రంలోనే తొలిసారిగా అమెరికా వైద్యులు ఇటీవల ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రయోగం విఫలమైంది. పంది గుండెను అమర్చిన రెండు నెలల అనంతరం ఆ రోగి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరణం ముప్పును ఎదుర్కొంటున్న డేవిడ్‌ బెనెట్‌(57) అనే వ్యక్తికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ మెడికల్‌ సెంటర్‌ వైద్యులు జనవరి 7న జన్యుమార్పిడి చేసిన పంది గుండెను విజయవంతంగా అమర్చారు. అయితే శస్త్ర చికిత్స అనంతరం కొన్నివారాల పాటు గుండె పనితీరు బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఆ వ్యక్తి ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం మృతిచెందాడు. 

బెనెట్‌ తన చివరి క్షణం వరకు ఎంతో ధైర్యంగా ఉన్నాడని ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ బార్ట్‌లీ గ్రిఫిత్‌ పేర్కొన్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. దశాబ్దాలుగా మానవ అవయవాల కొరతను తీర్చేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలకు ఈ ప్రయోగం ఎన్నో ఆశలు రేపింది. 

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని