గూగుల్ వేర్‌ ఓఎస్‌తో ఫాసిల్ స్మార్ట్‌వాచ్‌..

గత కొంత కాలంగా స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొవిడ్‌-19 ప్రభావంతో ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన ఉత్పత్తుల కొనుగోళ్లకు ఎక్కువ మంది శ్రద్ధ చూపుతున్నారు. దీన్ని దృష్టిలో

Updated : 12 Aug 2022 15:56 IST

ఇంటర్నెట్ డెస్క్: గత కొంత కాలంగా స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొవిడ్‌-19 ప్రభావంతో ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన ఉత్పత్తుల కొనుగోళ్లకు ఎక్కువ మంది శ్రద్ధ చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గ్యాడ్జెట్ తయారీ కంపెనీలు సరికొత్త ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఫాసిల్ వాచ్‌ కంపెనీ జెన్‌ 5ఈ మోడల్ స్మార్ట్‌వాచ్‌‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో హార్ట్‌రేట్ మానిటరింగ్, వాటర్‌ రెసిస్టెంట్, వేగవంతమైన ఛార్జింగ్ ఫీచర్స్‌ లాంటి చాలా ఉన్నాయి. మరి ఈ వాచ్‌ ధరెంత..ఇంకా ఎలాంటి ఫీచర్స్‌ ఇస్తున్నారనేది తెలుసుకుందాం.

ఫాసిల్‌  జెన్‌ 5ఈ ఫీచర్స్‌

గూగుల్‌ ఓఎస్‌తో పనిచేసే ఈ వాచ్‌లో 1.19-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీన్ని డయల్ స్మోక్ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారు చేశారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ వేర్‌ 3100 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 5ఏటియం వాటర్‌  రెసిస్టెంట్ ఫీచర్‌ ఇస్తున్నారు. దీని వల్ల వాచ్‌ నీటిలో తడిచినా పాడవకుండా పనిచేస్తుంది. పీపీజీ హార్ట్‌రేట్ సెన్సర్‌, ఆఫ్‌బాడీ ఐఆర్‌, గైరోస్కోప్‌, యాక్సిలరో మీటర్‌ ఉన్నాయి. ఇందులో గూగుల్ ఫిట్‌ ఉంది. ఇది యూజర్‌ రోజువారీ యాక్టివిటీలను ట్రాక్‌ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంది. స్లీప్‌, హార్ట్‌రేట్, కార్డియో లెవల్స్‌ని ట్రాక్‌ చేస్తుంది. వెయ్యికి పైగా వాచ్‌ ఫేస్‌లు ఉన్నాయి. ఆల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే ఉంది. ఈ వాచ్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 24 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని, 50 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుందని  ఫాసిల్ తెలిపింది. డైలీ, ఎక్స్‌టెండ్, టైం ఓన్లీ, కస్టమ్‌ అని నాలుగు బ్యాటరీ మోడ్‌లు ఉన్నాయి. 1జీబీ ర్యామ్‌/4జీబీ మెమొరీ వేరియంట్లో తీసుకొచ్చారు. దీని ధర రూ. 18,490. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చెయ్యొచ్చు.

ఇవీ చదవండి..

యూవీ శానిటైజేషన్‌తో ఇయర్‌బడ్స్‌..

జిబ్‌ ట్రూ: సింగిల్‌ ఛార్జ్‌తో రోజంతా మ్యూజిక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు