Updated : 29 Jan 2022 13:10 IST

Marriage: మళ్లీ కట్టా తాళి... ఓట్లేసి ఆశీర్వదించాలి

పెళ్లి చేసుకుంటున్న ప్రశాంత్, ప్రభాతి  

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఆయనకు ఇదివరకే పెళ్లయింది. సంప్రదాయబద్ధంగా మరోసారి కల్యాణం చేసుకున్నాడు. ఎందుకలా? అనేగా మీ అనుమానం... అయితే చదవండి.. ఒడిశాలోని గంజాం జిల్లా కళ్లికోట సమితిలోని అయితపూర్‌ పంచాయతీకి చెందిన ప్రశాంత పొళాయి గతంలో ఇదే సమితిలోని శ్రీకృష్ణశరణపూర్‌కు చెందిన ప్రభాతి సాహును న్యాయస్థానంలో వివాహం చేసుకున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేసేందుకు ఆయన ముందుగా ఏర్పాట్లు చేసుకున్నాడు. రిజర్వేషన్‌లో ఆ సర్పంచి స్థానం మహిళకు కేటాయించారు. దీంతో ప్రశాంత్‌ భార్య ప్రభాతిని రంగంలో దింపేందుకు నిర్ణయించుకున్నాడు. కోర్టు వివాహపత్రాన్ని జతపరిచి ఆమె సర్పంచి అభ్యర్థినిగా నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎవరినో తీసుకొచ్చి అభ్యర్థిగా నిలిపాడని ప్రత్యర్థులు ప్రచారం చేసే అవకాశం ఉందని, పంచాయతీ పరిధిలోని గ్రామాల ఓటర్లు కూడా ఆ విషయాన్ని నమ్మేస్తారేమోనన్న అనుమానంతో గురువారం పంచాయతీలోని ఓ మందిరంలో సంప్రదాయబద్ధంగా ప్రభాతిని మరోసారి వివాహం చేసుకున్నాడు ప్రశాంత్‌.
 

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని