Khiladi: ఆ ప్రోత్సాహమే వేరు
‘ఖిలాడి’ రవితేజతో జోడీ కట్టిన ఖిలేడీసే... మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి. డింపుల్ అచ్చ తెలుగమ్మాయి కాగా, మీనాక్షి ముంబయి భామ. ‘ఖిలాడి’ ట్రైలర్‌ని గమనిస్తే ఇద్దరు కథానాయికలూ
‘ఖిలాడి’ రవితేజతో జోడీ కట్టిన ఖిలేడీసే... మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి. డింపుల్ అచ్చ తెలుగమ్మాయి కాగా, మీనాక్షి ముంబయి భామ. ‘ఖిలాడి’ ట్రైలర్‌ని గమనిస్తే ఇద్దరు కథానాయికలూ సినిమాకి కావాల్సినంత గ్లామర్‌ని జోడించినట్టు స్పష్టమవుతోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరు కథానాయికలు మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
మీ ఇద్దరూ ఒకరి గురించి ఒకరు చెప్పమంటే ఏం చెబుతారు?
మీనాక్షి: ఆత్మ విశ్వాసం ఉన్న అమ్మాయి. ఆమెతో కలిసి నటిస్తున్నప్పుడు పక్కనున్న నటులు చాలా సౌకర్యంగా ఫీల్ అవుతారు. అందరితోనూ కలిసిపోతుంది. డింపుల్‌తోపాటు, ఇందులో చాలా మంది నటులు ఉన్నారు. వాళ్లందరితో కలిసి పనిచేయడం చక్కటి అనుభవం.
డింపుల్: మీనాక్షి కష్టపడి పైకి వచ్చిన కథానాయిక. ఎంతో ఒదిగి ఉంటుంది. తను పాల్గొన్న మిస్ దివా పోటీల్లో నేనూ పాల్గొన్నా. నేను మధ్యలోనే తప్పుకొన్నా. తను ఫైనల్ వరకు వెళ్లి టైటిల్ గెలుచుకుంది. తనతో కలిసి నటించాలన్నప్పుడు రిజర్వ్‌గా ఉంటుందేమో అనుకున్నా, కానీ తను అలా లేదు. చక్కగా కలిసిపోయింది.
ఈ సినిమా ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?
మీనాక్షి: రవితేజ కామెడీ టైమింగ్ పక్కాగా ఉంటుంది. అందుకోసం చాలా హోం వర్క్ చేశా. తెలుగులో సంభాషణలు చెప్పడం నాకో పెద్ద సవాల్. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నా. కొన్ని సన్నివేశాలు చేస్తున్నప్పుడు బెరుగ్గా కనిపించానంటే నేను మళ్లీ మామూలుగా అయ్యేవరకు సమయం తీసుకోమని చెప్పేవారు రవితేజ. ఆయన అందించే ప్రోత్సాహమే వేరు. ఆద్యంతం ఆస్వాదిస్తూ చేసిన సినిమా ఇది.
డింపుల్: యాక్షన్ సన్నివేశాల్లో తప్ప సినిమా మొత్తం నేను కనిపిస్తుంటాను. దర్శకుడు రమేష్ వర్మ ముందే ఆ విషయాన్ని చెప్పారు. ‘ఖిలాడి’లో క్యాచ్ మి... పాట చేయడానికి ముందు కొంచెం బొద్దుగా ఉన్నా. దర్శకుడు నన్ను బరువు తగ్గాలని చెప్పారు. ఆరు కిలోల బరువు తగ్గాక పాట చేయించారు.
గ్లామర్ మోతాదు ఎక్కువగానే కనిపిస్తోంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెబుతారు?
మీనాక్షి: వాణిజ్య ప్రధానమైన సినిమా కాబట్టి కొన్ని అంశాలు ఉంటాయి. దర్శకుడు నాకు కథ చెప్పినప్పుడే నీ పాత్ర ఇలా ఉంటుందని స్పష్టంగా చెప్పారు. వాణిజ్య సినిమా అన్నప్పుడు అందులో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. ముద్దు మానవీయ భావోద్వేగమే కదా. అయినా అవి తెరపై హద్దులు దాటినట్టేమీ ఉండవు. ముద్దు సన్నివేశాల్నీ నటనలో భాగంగానే చూస్తా.
డింపుల్: లంగా ఓణీతో పక్కింటి అమ్మాయిని గుర్తుచేస్తా, అదే సమయంలో ట్రెండీ అమ్మాయిగానూ కనిపిస్తా. పూర్తిస్థాయి మాస్ రోల్ అంటే ఎలా ఉంటుందో నా పాత్ర చూస్తే తెలుస్తుంది.
స్వతహాగా ఎలాంటి పాత్రల్ని ఇష్టపడతారు?
మీనాక్షి: తెలుగులో ఇది నా రెండో సినిమా. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చేస్తున్నప్పుడే రవితేజతో కలిసి నటించే అవకాశం వచ్చింది. మరో మాట మాట్లాడకుండా అంగీకారం తెలిపా. చిన్న పాత్రలైనా సరే, అందులో బలం ఉంటే తప్పకుండా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి.
డింపుల్: కథానాయిక తెలుగమ్మాయి అనగానే కొన్ని పరిమితులతో ముడిపెట్టి చూస్తుంటారు. నాకు అలా ఇష్టం ఉండదు. నేను నటిని. కథ, అందులో భాగంగా వచ్చే మంచి పాత్ర అనుకుంటే తప్పకుండా చేస్తా.
కొత్త సినిమాల ముచ్చట్లేమిటి?
మీనాక్షి: ‘హిట్ 2’లో నటిస్తున్నా. విజయ్ ఆంటోనీతో కలిసి ‘కొలై’ సినిమా చేస్తున్నా. అది త్వరలోనే విడుదల కానుంది. మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ‘సలార్’లోనూ నటిస్తున్నారట కదా అని అడుగుతున్నారు, ఖరారైన సినిమాల గురించే నేను చెప్పాలి కదా!
డింపుల్: కొన్ని సినిమాలు ఒప్పుకొన్నా. ఆ వివరాలు త్వరలోనే నిర్మాణ సంస్థల నుంచే తెలుస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్‌తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్