Naga Shaurya: ‘లక్ష్య’ గురి

నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ‘లక్ష్య’ విడుదల తేదీ ఖరారైంది. నవంబర్‌ 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు సోమవారం అధికారికంగా ప్రకటించాయి. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నాగశౌర్యకి జోడీగా కేతికశర్మ నటించింది.

Updated : 28 Sep 2021 07:03 IST

నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ‘లక్ష్య’ విడుదల తేదీ ఖరారైంది. నవంబర్‌ 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు సోమవారం అధికారికంగా ప్రకటించాయి. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నాగశౌర్యకి జోడీగా కేతికశర్మ నటించింది. నారాయణ్‌దాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్‌ కలిసి నిర్మిస్తున్నారు. క్రీడానేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాగశౌర్య విలుకాడిగా, రెండు విభిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని