yevam: ఆడపిల్లనే! ఐతే ఏంటంట?

చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్‌ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్‌’. నవదీప్‌, పవన్‌ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated : 27 Apr 2024 09:28 IST

చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్‌ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్‌’. నవదీప్‌, పవన్‌ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని చాందిని పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. అందులో చాందిని పోలీసుగా సీరియస్‌ లుక్‌లో కనిపించారు. ‘‘ఆడపిల్లనే! ఐతే ఏంటంట?’’ అంటూ ఆ పోస్టర్‌పై ఉన్న వ్యాఖ్య ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ‘‘కొత్తదనం నిండిన కథాంశంతో.. విభిన్నమైన నేరేషన్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నాం. తప్పకుండా ఇది అందరికీ నచ్చుతుంద’’ని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: కీర్తన శేషు, నీలేష్‌ మందలపు, ఛాయాగ్రహణం: ఎస్వీ విశ్వేశ్వర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని