vijay devarakonda: పాట లేదు ఆట మాత్రమే!

ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్‌’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్‌ దేవరకొండ.

Updated : 27 Apr 2024 09:24 IST

కవైపు ‘ఫ్యామిలీస్టార్‌’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్‌ దేవరకొండ. ఇటీవలే ఒక షెడ్యూల్‌ని పూర్తి చేసేశారు. వచ్చే నెల తొలి వారం నుంచి విశాఖపట్నంలో మరో షెడ్యూల్‌ చిత్రీకరణని ప్రారంభించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై, స్పై థ్రిల్లర్‌ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా విషయంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో పాటలు ఉండవని సమాచారం. థీమ్‌ మ్యూజిక్‌కి ప్రాధాన్యం ఉంటుందట. గతంలో ‘ఖైదీ’ కూడా ఇలా పాటల్లేకుండానే  ప్రేక్షకుల్ని అలరించింది. విజయ్‌ దేవరకొండ పోషిస్తున్న పాత్ర, సినిమా కథనం ప్రత్యేకంగా ఉంటాయని సమాచారం. ‘జెర్సీ’తో జాతీయ స్థాయిలో ప్రతిభని చాటారు గౌతమ్‌ తిన్ననూరి. ఆయన విజయ్‌తో జట్టు కట్టడంతో ఈ కలయికపై ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి. ఇందులో విజయ్‌ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించనున్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు