Rakhi Aur Rani Ki Prem Kahani: సెట్లోకి రాఖీ..రాణి!

కరోనా మూడోవేవ్‌ ప్రభావంతో బాలీవుడ్‌ స్తంభించిపోయింది. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో మళ్లీ సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఆయా చిత్రబృందాలు.

Updated : 02 Feb 2022 06:55 IST

రోనా మూడోవేవ్‌ ప్రభావంతో బాలీవుడ్‌ స్తంభించిపోయింది. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో మళ్లీ సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఆయా చిత్రబృందాలు. ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’. రణ్‌వీర్‌సింగ్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ జనవరి తొలివారంలో ఆగిపోయింది. తిరిగి బుధవారం నుంచి చిత్రీకరణ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 12 రోజుల ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయాబచ్చన్‌, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని