Cinema News: రోడ్డంతా రూ.రెండు వేల నోట్లు చల్లడంతో..!

అది ముంబయి మహా నగరం. అక్కడ ఓ ప్రాంతంలోని రోడ్డు మీద రూ.రెండు వేల నోట్లు కుప్పలుకుప్పలుగా పడి ఉన్నాయి. ఈ విషయం తెలిసిన కొద్ది సేపటికి చుట్టుపక్కల ఉండే వాళ్లంతా వాటిని ఏరుకోవడానికి ఎగబడ్డారు. తీరా వాటిని సరిగ్గా చూస్తే అవి నకిలీ నోట్లు.

Updated : 06 Oct 2021 12:19 IST

ది ముంబయి మహా నగరం. అక్కడ ఓ ప్రాంతంలోని రోడ్డు మీద రూ.రెండు వేల నోట్లు కుప్పలుకుప్పలుగా పడి ఉన్నాయి. ఈ విషయం తెలిసిన కొద్ది సేపటికి చుట్టుపక్కల ఉండే వాళ్లంతా వాటిని ఏరుకోవడానికి ఎగబడ్డారు. తీరా వాటిని సరిగ్గా చూస్తే అవి నకిలీ నోట్లు. దీంతో వాళ్లంతా నిరాశతో వెనుదిరిగారు. కొందరేమో ఇలా గాంధీ మహాత్ముడు ఫొటో ఉన్న నోట్లను రోడ్డుపై పారేయడం నేరం అంటూ కేసు పెట్టారు. దీనంతటికీ కారణం షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘సన్నీ’. ‘ఫ్యామిలీ మేన్‌’ సిరీస్‌ను తెరకెక్కించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌, డీకేలు దీనికి  దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌ చిత్రీకరణలో భాగంగా ఓ యాక్సిడెంట్‌ సన్నివేశం ఉంది. ఆ సమయంలో కరెన్సీ నోట్లు రోడ్డుపై చల్లాచెదురుగా పడిపోతాయి. దీని కోసం నకిలీ నోట్లను ఉపయోగించారు. కానీ చిత్రీకరణ పూర్తయ్యాకా వాటిని తీయడం మర్చిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. దీంతో కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘చిత్రీకరణ కోసం అనుమతి తీసుకున్నారు. గాంధీ మహాత్ముడికి  అవమానం జరిగిందనే విషయంపై విచారణ చేస్తున్నాం’’అని పోలీస్‌ వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది. ‘‘చిత్రీకరణ ముగిశాకా అంతా శుభ్రం చేసింది మా బృందం. మరి ఆ నకిలీ నోట్లు ఎలా వచ్చాయో తెలియడం లేదు. ఇక గాంధీని అగౌరవ పరచాలనే ఆలోచన అయితే మాకు ఎంతమాత్రం లేదు’’అని చిత్ర నిర్మాతలు చెప్పినట్టు బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఇదిగో ఇలా సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఈ సిరీస్‌లో విజయ్‌ సేతుపతి, రాశీ ఖన్నా, రెజీనా నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని