‘వావ్‌’ ఓజా.. జ్వాల.. ద్రోణవల్లి హారిక

‘వావ్’ చరిత్రలో మొదటిసారిగా క్రీడాకారులు రావటం విశేషంగా ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. సాయికుమార్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న గేమ్ షో ‘వావ్-3’. పలు క్రీడలలో ప్రతిభ కనబరుస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్ర్ర్రజ్ఞాన్‌ ఓజా, గుత్తా జ్వాల, మధు శాలిని, ద్రోణవల్లి హారిక తాజాగా ఈ గేమ్ షోలో పాల్గొని సందడి చేశారు.

Published : 30 Dec 2020 18:06 IST

హైదరాబాద్: ‘వావ్’ చరిత్రలో మొదటిసారిగా క్రీడాకారులు రావటం విశేషంగా ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. సాయికుమార్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న గేమ్ షో ‘వావ్-3’. పలు క్రీడలలో ప్రతిభ కనబరుస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రజ్ఞాన్‌ ఓజా, గుత్తా జ్వాల, మధు శాలిని, ద్రోణవల్లి హారిక తాజాగా ఈ గేమ్ షోలో పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

షోలో భాగంగా ‘ఏది నీ బెస్ట్ వికెట్’ అని ఓజాను సాయికుమార్ అడుగగా.. ‘అది క్రిస్‌ గేల్. ఎందుకంటే ఆయన ఛాలెంజ్‌ చేశాడు సర్’ అని చెప్పారు. అలాగే ‘బాహుబలి చిత్రాన్ని ఎన్ని సార్లు చూసుంటారు’ అని జ్వాలను సాయికుమార్ ప్రశ్నించగా.. ‘చాలా సార్లు’ అనగా.. దానికి ఓజా అందుకొని ‘సర్‌ అడిగింది.. సినిమాను ఎన్ని సార్లు చూశావని.. అంతే కానీ ప్రభాస్‌ను ఎన్ని సార్లు చూశావని కాదు’ అంటూ సరదాగా ఆమెను ఆటపట్టించారు. అదే విధంగా ‘అపరిచితుడు క్యారెక్టర్ ఏ గ్రంథం ఆధారంగా తప్పులు చేసిన వారికి శిక్షలు విధిస్తుంటాడు’ అని సాయికుమార్ అడుగగా...  ఓజా సరదాగా పంచులతో నవ్వులు పూయించారు. ఈ నవ్వుల హంగామాను వీక్షించాలంటే వచ్చే మంగళవారం (జనవరి 5) రాత్రి ప్రసారం కానున్న ‘వావ్-3’ కార్యక్రమాన్ని చూడాల్సిందే.. అప్పటివరకు ఈ ప్రోమోను చూసేయండి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని