Trisha: రాజకీయాల్లోకి సినీ నటి త్రిష?

దక్షిణాది అగ్ర కథానాయిక త్రిష (Trisha) పొలిటకల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్తలు సినీవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా.....

Updated : 19 Aug 2022 18:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాది అగ్ర కథానాయిక త్రిష (Trisha) పొలిటకల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్తలు సినీవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. తమిళ సూపర్‌స్టార్‌ హీరో విజయ్‌ సూచన మేరకు ఆమె క్రియాశీల రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలనుకొంటున్నట్టు కోలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. అంతేకాదు.. 39 ఏళ్ల ఈ అందాల తార కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని కూడా నిర్ణయించుకున్నట్టు ఊహాగానాలు వినబడుతున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేకపోగా.. త్రిష కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఆమె రాజకీయ అరంగేట్రం నిజమైతే.. తన అందం, అభినయంతో వెండితెరపై ప్రేక్షకుల్ని మెప్పించిన త్రిష.. రాజకీయాల్లో ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేయగలుగుతారో చూడాలి.

‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘కింగ్‌’, ‘బాడీగార్డ్‌’, ‘బంగారం’, ‘స్టాలిన్‌’, ‘లయన్‌’ వంటి చిత్రాలతో తెలుగులోని స్టార్‌ హీరోలందరి సరసన త్రిష నటించారు. 2016లో విడుదలైన ‘నాయకి‌’ తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె వరుస తమిళ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అందులో మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ సెప్టెంబర్‌ 30న విడుదల కానుంది. ధనుష్‌ కథానాయకుడిగా నటించిన ‘ధర్మయోగి’లో త్రిష రాజకీయ నాయకురాలి పాత్ర పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని