Jhund: గుంపు కాదు ‘పుట్‌బాల్‌’ టీమ్‌

అమితాబ్‌బచ్చన్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా నటించిన చిత్రం ‘ఝుండ్‌’. ‘సైరాట్‌’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నాగరాజ్‌ మంజులే దర్శకత్వం వహించిన ఈ చిత్రమిది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను

Updated : 09 Feb 2022 07:00 IST

అమితాబ్‌బచ్చన్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా నటించిన చిత్రం ‘ఝుండ్‌’. ‘సైరాట్‌’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నాగరాజ్‌ మంజులే దర్శకత్వం వహించిన ఈ చిత్రమిది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఫుట్‌బాల్‌ ఆటగాడు, విజయ్‌బార్సే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. మాదక ద్రవ్యాలకు బానిసలైన వీధి బాలల్లో మార్పు తీసుకొచ్చి ఫుట్‌బాల్‌ జట్టుని తయారు చేసే ఈ కథ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కోచ్‌ పాత్రకు అమితాబ్‌ ప్రాణం పోశారని ట్రైలర్‌ను విడులయ్యాకా నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘గుంపు కాదు టీమ్‌ అనండి’ అని పోస్టర్‌ మీద రాసిన వాక్యం ఆకట్టుకుంటోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు