Malavika Mohanan: నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్‌ ఘాటు రిప్లై

మలయాళీ నటి మాళవిక మోహనన్‌ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే?

Updated : 30 Apr 2024 11:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) ఒకరు. నటనకు కాస్త బ్రేక్‌ ఇచ్చి, సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించాలని ప్లాన్‌ చేసుకున్నారు. అనుకున్నట్లే ‘ఆస్క్‌ మాళవిక’ #AskMalavika పేరిట ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌)లో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ నిర్వహించారు. ఆమె ఇష్టాయిష్టాలు, రాబోయే సినిమాల గురించి పలువురు అడగ్గా.. ఓ నెటిజన్‌ మాత్రం నటి అసహనానికి గురయ్యేలా ప్రశ్నించాడు. ‘‘గ్లామర్‌ షోకు బదులు నటించడం ఎప్పుడు ప్రారంభిస్తారు?’’ అనే ప్రశ్నకు ‘నేను చేయను. నీకు ఏమైనా ఇబ్బందా?’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ‘ఫీల్‌ అవ్వకండి’, ‘మీరు అలాంటి వారికి ఎందుకు ఆన్సర్‌ ఇస్తారు’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ చిట్‌చాట్‌లోని విశేషాలివీ..

‘తంగలాన్‌’లోని మీ పాత్రకు డబ్బింగ్‌ మీరే చెప్పారా?

మాళవిక: అవును. నేనే డబ్బింగ్‌ చెప్పా. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నా.

‘తంగలాన్‌’ విడుదల ఎప్పుడు?

మాళవిక: నాకూ తెలియదు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది.

హైదరాబాద్‌లో మీకు నచ్చిన వంటకం?

మాళవిక: అన్నీ ఇష్టమే. ప్రతిదీ స్పైసీగా ఉంటుంది.

మీ ఫేవరెట్‌ హీరోయిన్స్‌?

మాళవిక: అనుష్క శెట్టి, సమంత.

మీరెందుకు ఎక్కువగా గ్లామరస్‌ ఫొటోషూట్స్‌లో పాల్గొంటారు?

మాళవిక: ఎందుకంటే నాకిష్టం

మీ పెళ్లెప్పుడు?

మాళవిక: నా పెళ్లి చూసేందుకు కోసం నువ్వెందుకు తొందరపడుతున్నావ్‌

ఫస్ట్‌ సెలబ్రిటీ క్రష్‌ ఎవరు?

మాళవిక: హృతిక్‌ రోషన్‌

మీకెలాంటి సినిమాలు నచ్చుతాయి?

మాళవిక: లవ్‌ డ్రామా, రొమాంటిక్‌ కామెడీ, థ్రిల్లర్‌ జానర్‌ మూవీస్‌

ఐపీఎల్‌లో మీ ఫేవరెట్‌ టీమ్‌?

మాళవిక: నేను క్రికెట్‌ చూడను

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.యు. మోహనన్‌ కుమార్తె ఈ మాళవిక. మలయాళ చిత్రం ‘పట్టం పోలే’ (2013)తో తెరంగేట్రం చేశారు. విక్రమ్‌తో కలిసి నటించిన పాన్‌ ఇండియా చిత్రమే ‘తంగలాన్‌ (Thangalaan). ‘పేట’, ‘మాస్టర్‌’, ‘మారన్‌’ వంటి డబ్బింగ్‌ చిత్రాలతో టాలీవుడ్‌ ఆడియన్స్‌ను పలకరించిన ఆమె నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రం ‘రాజాసాబ్‌’ (Raja Saab). ప్రభాస్‌ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని