ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆత్మహత్య..

 బాలీవుడ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated : 02 Aug 2023 11:49 IST

ముంబయి: బాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌ (Nitin Desai) ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం అతడు తన స్టూడియోలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి నితిన్‌ దేశాయ్‌ తన స్టూడియోకు వెళ్లాడు. అక్కడే ఉరివేసుకుని మరణించినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. 

ఇక నితిన్‌ దేశాయ్‌ పనిచేసిన ఎన్నో సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. హిందీ, మరాఠి భాషల్లో స్టార్‌ హీరోల సినిమాలకు పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లగాన్‌ (Lagaan), దేవదాస్‌(2002), జోదా అక్బర్‌ (Jodhaa Akbar) వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఆయన సేవలందించారు. వీటికి గానూ ఆయన నాలుగు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. కేవలం ఆర్ట్‌ డైరెక్టర్‌గానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా రెండు సినిమాలకు పనిచేశారు. నటుడిగా నాలుగు సినిమాల్లో కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు