Tollywood: గెలుపు కోసం ‘బరి’లోకి!

రాజా, సహాన జంటగా రూపొందిన చిత్రం ‘బరి’. సురేష్‌రెడ్డి దర్శకత్వం వహించారు. మునికృష్ణ.సి.వి, గీతాకృష్ణ నిర్మాతలు. ఈ నెల 8న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. దర్శకుడు వీరశంకర్‌ ముఖ్య  అతిథిగా హాజరయ్యారు.

Updated : 07 Apr 2022 12:03 IST

రాజా, సహాన జంటగా రూపొందిన చిత్రం ‘బరి’. సురేష్‌రెడ్డి దర్శకత్వం వహించారు. మునికృష్ణ.సి.వి, గీతాకృష్ణ నిర్మాతలు. ఈ నెల 8న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. దర్శకుడు వీరశంకర్‌ ముఖ్య  అతిథిగా హాజరయ్యారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘గ్రామీణ కథ ఇది. కోడి  పందేల చుట్టూ జరిగే సంఘటనలు కీలకమ’’న్నారు. ‘‘గెలుపు కోసమే తీసిన చిత్రం మా ‘బరి’. పూర్తి భిన్నంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత. ‘‘ట్రైలర్‌లో బలమైన భావోద్వేగాలున్నాయి. వాణిజ్యాంశాల్ని మేళవించిన విధానం దర్శకుడి ప్రతిభకి అద్దం పడుతుంది. సంగీతం, కెమెరా పనితనం ఆకట్టుకునేలా ఉన్నాయ’’న్నారు వీరశంకర్‌. ఈ కార్యక్రమంలో  నాయకానాయికలతోపాటు, సావిత్రి, సునీత మనోహర్‌, అరుణ్‌, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని