Bigg boss season 7: క్షమించే గుణం లేనప్పుడు.. నువ్వు మాటలు జారకూడదు!

బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఎనిమిదో వారానికి సంబంధించిన వీకెండ్‌ ఎపిసోడ్‌ తొలి ప్రోమో విడుదలైంది

Published : 28 Oct 2023 17:51 IST

హైదరాబాద్‌: నామినేషన్స్‌, టాస్క్‌లతో వారమంతా కాస్త హాట్‌గా, ఇంకాస్త సందడిగా గడిచిన బిగ్‌బాస్‌ హౌస్‌ శనివారం వచ్చే సరికి వణికిపోతూ ఉంటుంది. వారం రోజుల్లో హౌస్‌మేట్స్‌ చేసిన తప్పోప్పులను సమీక్షిస్తూ నాగార్జున ఇచ్చే ఫీడ్‌ బ్యాక్‌ ఎలా ఉంటుందా? అని అందరూ కంగారూ పడుతూ ఉంటారు. ఈ వారం హౌస్‌లో కాస్త వాడీ, వేడీ వాతావరణమే నడిచింది. ఈ క్రమంలో వీకెండ్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన తొలి ప్రోమో విడుదలైంది. నామినేషన్స్‌ దగ్గరి నుంచి ప్రతి విషయంలో హౌస్‌మేట్స్‌తో గొడవపడుతూ వస్తున్న శోభాశెట్టిని నాగార్జున క్లాస్‌ తీసుకున్నారు. ‘గతవారం భోలే నిన్ను ఎర్రగడ్డ అంటేనే తట్టుకోలేకపోయావు. క్షమించే గుణం లేనప్పుడు మాటలు జారకూడదు’ అంటూ శోభాపై అసహనం వ్యక్తం చేసిన నాగార్జున.. బిగ్‌బాస్‌ ప్రాపర్టీ నాశనం చేసిన యావర్‌పైనా మండిపడ్డారు. ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండ్‌ అవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని