Deepika Padukone: ఆస్కార్‌ వేదికపై మెరవనున్న దీపిక

ఆస్కార్‌ (Oscars) వేడుకలకు సంబంధించి మన దేశానికి మరో గౌరవం దక్కింది. బాలీవుడ్‌ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె (Deepika Padukone) ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు.

Updated : 12 Mar 2023 18:52 IST

ఆస్కార్‌ (Oscars) వేడుకలకు సంబంధించి మన దేశానికి మరో గౌరవం దక్కింది. బాలీవుడ్‌ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె (Deepika Padukone) ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు. తాజాగా ఆస్కార్‌ అకాడమీ విడుదల చేసిన ప్రజెంటర్ల జాబితాలో దీపికా పేరుంది. ఇందులో డ్వేన్‌జాన్సన్‌, శామ్యూల్‌ ఎల్‌ జాక్సన్‌, జోయాసల్డానా, ఎమీలీ బ్లంట్‌ లాంటి సినీ ప్రముఖులు ఉండటం విశేషం. దీపికకు ఆ గౌరవం దక్కడంతో పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై మెరిసిన దీపిక ఆస్కార్‌ సంబరాల్లో ఎలా మెరుస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి మనకు మూడు నామినేషన్లు దక్కాయి. ‘నాటు నాటు’కు కచ్చితంగా అవార్డు వస్తుందని అందరూ నమ్మకంతో ఉన్నారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ.. ఈ పాటను లైవ్‌లో పాడే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని