Saindhav: నోట్లో తుపాకీ పెట్టి కాలిస్తే, బుల్లెట్‌ అలా బయటకు వస్తుందా? ‘సైంధవ్‌’లో షాట్‌పై డైరెక్టర్‌ ఏమన్నారంటే?

Saindhav: వెంకటేష్‌ కథానాయకుడిగా నటించిన ‘సైంధవ్’ మూవీలో షాట్‌ గురించి దర్శకుడు సైలేష్‌ కొలను వివరణ ఇచ్చారు.

Updated : 10 Feb 2024 11:49 IST

హైదరాబాద్‌: వెంకటేష్‌ (Venkatesh) కథానాయకుడిగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సైంధవ్‌’ (Saindhav). శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఆద్యంతం యాక్షన్‌ థీమ్‌తో సాగిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. ట్రైలర్‌లో వెంకటేశ్‌.. ఓ రౌడీ నోట్లో తుపాకీ పెట్టి కాస్తే, బుల్లెట్‌ అతడి మలద్వారం నుంచి బయటకు వచ్చినట్లు చూపించారు. దీనిపై సోషల్‌మీడియా వేదికగా మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఓ నెటిజన్‌ ‘బుల్లెట్‌ జర్నీ ఇలా’ అంటూ పెట్టిన వీడియో వైరల్‌ అయింది. అది చూసిన దర్శకుడు శైలేష్‌ కొలను స్పందించారు. నోట్లో తుపాకీ పెట్టి కాలిస్తే, బుల్లెట్‌ మలద్వారం నుంచి బయటకు వచ్చే విషయమై పూర్తి వివరణ ఇచ్చారు.

“హహ్హహ్హ.. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఏ విషయమైనా వివరించి చెప్పడానికి నేను ఇష్టపడతా. సాధారణంగా నోట్లో తుపాకీ పెట్టి కాలిస్తే బుల్లెట్‌ తల వెనుక వైపు నుంచి బయటకు వస్తుంది. కానీ, ఒక వ్యక్తిని నిర్దిష్ట దిశలో కూర్చోబెట్టి, గన్‌ బ్యారెల్‌ను వీలైనంత అతడి నోటి లోపలికి పెట్టి, సుమారు 80 డిగ్రీల కోణంలో కిందకు కాలిస్తే,  శరీరంలో ఉన్న అవయవాలను చీల్చుకుంటూ బుల్లెట్‌ బయటకు వెళ్తుంది. మీరు డయాగ్రంలో చూపించినట్లు బుల్లెట్‌ మొదట.. శ్వాస కోశం, అన్నవాహిక, కాలేయం, పాంక్రియాస్‌, కొన్నిసార్లు గుండెను గాయం చేస్తుంది. ఆ తర్వాత పెద్ద, చిన్న ప్రేగులను అదే దిశలో నేరుగా చీల్చుకుంటూ శరీరం దిగువన మలద్వారం నుంచి బయటకు వస్తుంది. ఇలా షూట్‌ చేయడానికి ఎంతో నేర్పు కావాలి. సైకో స్పెషల్‌ స్కిల్‌ ఇది. థియేటర్‌లో ప్రేక్షకులను అలరించేందుకే ఈ మాస్‌ మూమెంట్‌ క్రియేట్‌ చేశాం. కానీ, మీ వీడియో చాలా ఫన్నీగా ఉంది బ్రదర్..’’ అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

‘‘అమ్మో.. మీ వివరణ చాలా బాగుంది. ఎడిట్‌ మీకు నచ్చింది చాలు.. సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్స్‌.. ‘సైంధవ్‌’కు ఆల్‌ ది బెస్ట్‌’’ అని సదరు నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు డైరెక్టర్‌ శైలేష్‌ కొలను వివరణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘మీ డీటెయిలింగ్‌కు టేక్‌ ఏ బౌ’, ‘డాక్టర్‌ అన్నా.. పాయింట్‌తో కొట్టావ్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు