Kapil dev: ఆ విషయంలో రణ్‌వీర్‌కి సాయం అక్కర్లేదు!

టీమిండియా మాజీ సారథి, 1983 వరల్డ్‌ కప్‌ విజేత కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘83’. రణ్‌వీర్‌ సింగ్‌ కపిల్‌ దేవ్‌గా కనిపించనున్న ఈ సినిమా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా బెంగళూరులో ఓ ప్రమోషన్‌ ఈవెంట్‌కి వెళ్లిన ఆయన ‘83’ చిత్ర అనుభవాలను పంచుకున్నారు.

Published : 14 Dec 2021 20:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా మాజీ ఆటగాడు, 1983 వరల్డ్‌ కప్‌ జట్టు సారథి కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘83’. కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌ కనిపించనున్న ఈ సినిమా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా బెంగళూరులో ఓ ప్రమోషన్‌ ఈవెంట్‌కి వెళ్లిన ఆయన ‘83’ చిత్ర అనుభవాలను పంచుకున్నారు. ‘‘ ట్రైలర్‌ చూడగానే నేను చాలా భావోద్వేగానికి గురయ్యా! కానీ మొత్తం సినిమా ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేను. అది తెలియాలంటే ఈ నెల 24 వరకూ ఆగాల్సిందే. నటనపరంగా చూస్తే.. రణ్‌వీర్‌ గొప్ప నటుడు. ఎలాంటి ఇన్‌పుట్స్‌ లేకుండా తేలికగా అర్థం చేసుకొని నటించాడు. ఆ విషయంలో ఎవరిసాయం అవసరం లేదు. నా పాత్రకోసం కొన్ని రోజులు నాతో కలిసి ప్రయాణించాడు. మిగిలినదంతా తన స్మార్ట్‌ వర్క్‌తో చేసుకుంటూ వెళ్లిపోయాడు’’ అన్నారు. తమిళ నటుడు జీవా,  హీర్‌ రాజ్‌ భాసిన్‌,  తదితరులు కీలకపాత్రలు పోషించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకానుంది. 3డీ వెర్షన్‌లోనూ సందడి చేయనుంది. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున విడుదల చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని