ఇది ఆమిర్‌ ఖాన్‌క్యాలెండర్‌

నటనకు పెట్టింది పేరు ఆమీర్‌ఖాన్‌. ఆయన ఏ పాత్ర పోషించినా అందులో పరకాయ ప్రవేశం చేస్తారు. అందుకే ఆయన చేసిన పాత్రలు అభిమానుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతాయి. పీకే, లగాన్‌, గజినీ వంటివి ఆ కోవలోకే వస్తాయి. అలా ఇప్పటి వరకు నటించిన హిట్‌ చిత్రాల పాత్రల ఆధారంగా ముంబయికి

Published : 13 Feb 2020 01:05 IST

ముంబయి: నటనకు పెట్టింది పేరు ఆమీర్‌ఖాన్‌. ఆయన ఏ పాత్ర పోషించినా అందులో పరకాయ ప్రవేశం చేస్తారు. అందుకే ఆయన చేసిన పాత్రలు అభిమానుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతాయి. పీకే, లగాన్‌, గజినీ వంటివి ఆ కోవలోకే వస్తాయి. అలా ఇప్పటి వరకు నటించిన హిట్‌ చిత్రాల పాత్రల ఆధారంగా ముంబయికి చెందిన చిత్రకారుడు మనోజ్‌ సిన్హా.. ఓ పన్నెండు క్యారికేచర్లతో ఓ క్యాలెండర్‌ను తయారుచేశాడు. ఆ క్యాలెండర్‌ను ఆమిర్‌ ఖాన్‌కు స్వయంగా అందజేశాడు. ఈ క్యాలెండర్‌లో డిసెంబర్‌లో విడుదల కానున్న ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’ సహా.. పీకే, అందాజ్‌ అప్నా అప్నా, దంగల్‌, గజిని, 3 ఇడియట్స్‌, దిల్‌ చాహతా హై, సీక్రెట్‌ సూపర్‌స్టార్‌, లగాన్‌, తారే జమీ పర్‌ చిత్రాల్లో ఆమిర్‌ పోషించిన పాత్రలను పొందుపరచారు. దీనిని చూసిన మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌ ఎంతో మురిసిపోయాడట.

కాగా ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’ కు ఆమిర్‌ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండగా... ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ దర్శకుడు అద్వైత్‌ చందన్‌ సారథ్యం వహించనున్నారు. ఇది టామ్‌ హాంక్స్‌ నటించిన 1994 నాటి హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌ అని తెలిసిందే. ఈ చిత్రంలో కరీనా కపూర్‌, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి నటిస్తున్నారు. క్రిస్మస్‌కు సందడి చేసేందుకు ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’గా ఆమీర్‌ సిద్ధమవుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని