Prabhas: ప్రభాస్‌కు దిల్లీ కోర్టు నోటీసులు
ఆదిపురుష్ చిత్ర బృందానికి దిల్లీ కోర్టు షాకిచ్చింది. చిత్ర హీరో ప్రభాస్‌తో పాటు మొత్తం చిత్రయూనిట్‌కు సోమవారం నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఆదిపురుష్ చిత్ర బృందానికి దిల్లీ కోర్టు షాకిచ్చింది. చిత్ర హీరో ప్రభాస్‌తో పాటు మొత్తం చిత్రయూనిట్‌కు సోమవారం నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదల కాగా పలు వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ఆదిపురుష్ చిత్రబృందం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ ఓ సంస్థ దిల్లీ కోర్టును ఆశ్రయించింది. అంతేకాకుండా ఆదిపురుష్ సినిమా విడుదలపై స్టే విధించాలని కూడా కోరింది. తాజాగా ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన దిల్లీ కోర్టు ప్రభాస్‌తో పాటు ఆదిపురుష్ చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది. కాగా, గత కొద్ది రోజులుగా ఆదిపురుష్ టీజర్‌పై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ మూవీ గురించే చర్చ జరుగుతోంది. యానిమేటెడ్ చిత్రంలా ఉందని ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో రాముడు, రావణుడు, హనుమంతుడు పాత్రలను చూపించిన విధానం సరైందని కాదని.. పలు సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. రామాయణం గురించి అధ్యయనం చేయకుండానే ఓంరౌత్ ఆదిపురుష్ తెరకెక్కించారంటూ ఆయనపై రాజకీయ నేతలు కోప్పడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!
-
India News
Chandigarh University: పరీక్షలో పాటలే సమాధానాలు.. లెక్చరర్ కామెంట్‌కు నవ్వులే నవ్వులు
-
India News
Plant Fungi: మనిషికి సోకిన ‘వృక్ష శీలింధ్రం’.. ప్రపంచంలోనే తొలి కేసు భారత్‌లో!
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Movies News
Aditya Om: ఇంకా బతికే ఉన్నారా? అని కామెంట్ చేసేవారు: ఆదిత్య ఓం
-
Politics News
Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!