నాగార్జున బాటలోనే సమంత..!
చైతూతో పెళ్లైన తర్వాత సమంత సినిమాల జోరు పెంచింది. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు ఎక్కువగా చేస్తున్న సమంత వరుస విజయాలతో దూసుకెళుతోంది. కేవలం సినిమాలతోనే కాదు.
ముంబయి: చైతూతో పెళ్లైన తర్వాత సమంత సినిమాల జోరు పెంచింది. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు ఎక్కువగా చేస్తున్న సమంత వరుస విజయాలతో దూసుకెళుతోంది. కేవలం సినిమాలతోనే కాదు.. ఆమె అభిమానులను అలరించేందుకు వెబ్ సిరీస్లోకీ అడుగుపెట్టింది. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి ఓ రియాలిటీ షోకు హోస్ట్‌గా కూడా చేయనున్నట్లు సమాచారం.
ఇటీవల సమంత హీరోయిన్గా వచ్చిన చిత్రం ‘జానూ’ కలెక్షన్ల పరంగా అంతపెద్ద విజయం సాధించకపోయినా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా వెంటనే తన తర్వాతి సినిమాలకు ఓకే చెప్పేసింది సమంత. విఘ్నేష్ దర్శకత్వంలో ‘కథువక్కుల రెండు కాదల్’ అనే చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి సమంత కనిపించనుంది. అంతేకాదు.. అశ్విన్ శరవరణ్ దర్శకత్వంలో వస్తున్న ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ ఆమె నటిస్తున్నట్లు సమాచారం. సినిమాల విషయం పక్కనపెడితే.. ‘ది ఫ్యామిలీ మ్యాన్2’తో ఆమె తొలిసారిగా వెబ్‌సిరీస్‌లోకి అడుగుపెట్టనుంది. ఆ వెబ్ సిరీస్ ముగిసిన వెంటనే ఓ రియాలిటీ షోలో కనిపించనుంది. అయితే, రియాలిటీ షోకు హోస్ట్‌గా చేస్తుండటంపై సమంత ఎలాంటి ప్రకటన చేయలేదు. సామ్ చేయనున్న ఈ షో మీలో ఎవరు కోటీశ్వరుడును పోలి ఉంటుందని తెలుస్తోంది. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు రియాలిటీ షోకు నాగార్జున హోస్ట్‌గా పని చేసిన విషయం తెలిసిందే. తాజాగా సమంత సైతం అదే బాటలో పయనిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్‌కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?