చిరు సినిమాలో కాజల్..?

టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్‌ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా కొరటాలశివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. చిరు152 చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో త్రిషను కథానాయికగా అనుకున్నారు. కాకపోతే క్రియేటివ్‌ అంశంలో భిన్నాభిప్రాయాలు రావడం వల్ల..

Published : 14 Mar 2020 14:39 IST

త్రిష స్థానంలో..

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్‌ మరోసారి సందడి చేయనుందా? చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. చిరు152 చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో త్రిషను కథానాయికగా అనుకున్నారు. కాకపోతే క్రియేటివ్‌ అంశంలో భిన్నాభిప్రాయాలు రావడం వల్ల తాను ‘ఆచార్య’ చిత్రం నుంచి తప్పుకొంటున్నట్లు త్రిష తాజాగా సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్రిష స్థానంలో కాజల్‌ నటించనున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ‘ఖైదీ నెం150’ చిత్రంతో చిరు-కాజల్ జంట ప్రేక్షకులను మెప్పించడంతో చిత్రబృందం కూడా ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాజల్‌ చేతిలో ‘మోసగాళ్లు’, ‘భారతీయుడు 2’, ‘ముంబయి సాగా’ చిత్రాలు ఉన్నాయి.

కొణిదెల ప్రాడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవాదాయ శాఖలో అవినీతిని అరికట్టే కథాంశంతో ఈ సినిమా ఉండనుందని సమాచారం. ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్రను మహేశ్‌ పోషించనున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని