తెలుగు ఛానెల్‌పై ‘కేజీఎఫ్‌’ నిర్మాతల ఆగ్రహం

ప్రపంచ వ్యాప్తంగా కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన ‘కేజీఎఫ్‌’ సినిమా నిర్మాతలు ఓ తెలుగు ఛానెల్‌పై కేసు పెట్టనున్నారు. అనధికారికంగా ‘కేజీఎఫ్‌’ సినిమాను ప్రసారం చేశారని చిత్ర నిర్మాత కార్తిక్‌ గౌడ ట్వీట్‌ చేశారు. సదరు ఛానెల్‌పై ఆగ్రహం వ్యక్తం

Updated : 12 May 2020 10:27 IST

బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన ‘కేజీఎఫ్‌’ సినిమా నిర్మాతలు ఓ తెలుగు ఛానెల్‌పై కేసు పెట్టనున్నారు. అనధికారికంగా ‘కేజీఎఫ్‌’ సినిమాను ప్రసారం చేశారని చిత్ర నిర్మాత కార్తిక్‌ గౌడ ట్వీట్‌ చేశారు. సదరు ఛానెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ‘ఓ తెలుగు లోకల్‌ ఛానెల్‌ ‘కేజీఎఫ్‌’ సినిమాను అనధికారికంగా ప్రసారం చేసింది. వారిపై మేం చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నాం. సమన్లు జారీ చేస్తాం. శాటిలైట్‌ డీలింగ్‌ దాదాపు ఖరారౌతున్న సమయంలో కేబుల్‌ ఛానెల్‌ ఈ పనిచేసింది. మా వద్ద ఆధారాలు కూడా ఉన్నాయి. వీడియోలు కూడా సేవ్‌ చేసిపెట్టుకున్నాం’ అంటూ సదరు ఛానెల్‌లో ‘కేజీఎఫ్‌’ ప్రసారమౌతున్నప్పుడు తీసిన ఫొటోను షేర్‌ చేశారు. దీంతో నెటిజన్లు స్పందించారు. ‘కేజీఎఫ్‌’ను లోకల్‌ ఛానెల్‌లో పలుమార్లు ప్రసారం చేశారని తెలిపారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని నిర్మాతలు పేర్కొన్నారు.

‘కేజీఎఫ్‌’ సినిమాలో యశ్‌ కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా తీస్తున్న ‘కేజీఎఫ్‌ 2’ తెరకెక్కుతోంది. ఇందులో రవీనా టాండన్‌, సంజయ్‌ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత సినిమా షూటింగ్‌ను తిరిగి కొనసాగించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని