Vikram Veda: నిశబ్దం అవసరం
తమిళంలో విజయ వంతమైన చిత్రం ‘విక్రమ్ వేధా’. మాధవన్, విజయ్‌సేతుపతి కథానాయకులు. ప్రస్తుతం ఈ చిత్రం బాలీవుడ్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. మాతృకకు దర్శకత్వం వహించిన
తమిళంలో విజయ వంతమైన చిత్రం ‘విక్రమ్ వేధా’. మాధవన్, విజయ్‌సేతుపతి కథానాయకులు. ప్రస్తుతం ఈ చిత్రం బాలీవుడ్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్ గాయత్రి ద్వయమే దీనికీ దర్శకులు. ఇందులో వేధా పాత్రను హృత్రిక్ రోషన్ పోషిస్తున్నాడు. చిత్రంలో తన పాత్ర ఆహార్యానికి సంబంధించిన లుక్‌ను తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు. ‘గందరగోళంలో నిశబ్దం అవసరం’ అంటూ గంభీరంగా ఉన్న హృత్రిక్ స్టిల్ ఆకట్టుకుంది. మరో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సైఫ్ అలీఖాన్ విక్రమ్ పాత్రలో హృత్రిక్ను ఢీకొట్టనున్నాడు. రాధికా ఆప్టే ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న వీరి పోరాటాలను థియేటర్లలో చూడవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్‌కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్‌లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్‌బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే